వలంటీర్ లకి షాక్...అలాంటి వారిని తొలగించాలని ఆదేశాలు !

వలంటీర్ లకి షాక్...అలాంటి వారిని తొలగించాలని ఆదేశాలు !

ఇప్పటికే ఇంటర్వ్యూలో హాజరయ్యి ఎంపిక అయి, నియామక పత్రాలు కూడా అందుకుని, చేయాల్సిన పనుల మీద శిక్షణ తీసుకుంటున్న గ్రామ వలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద షాకే ఇచ్చింది. అదేంటంటే గ్రామ వలంటీర్లుగా ఎంపికైన వారిలో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు లేదా ప్రైవేటు ఉద్యోగాలు చేసే వారు ఉన్నట్లు తేలితే వారిని వలంటీర్ ఉద్యోగం నుండి తక్షణమే తొలగించాల్సిందిగా ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉన్నట్టు కనుగొంటే దృవపత్రాలతో సహా ఫిర్యాదు చేస్తే వెంటనే వారిని తొలగిస్తామని కూడా అధికారులు స్పష్టం చేశారు.

రేపటి నుండి గ్రామ వలంటీర్లు విధుల్లో చేరాల్సి ఉన్నందున వారికి ప్రభుత్వం గుర్తింపు కార్డులను జారీ చేయనుంది. అయితే పూర్తిగా ప్రభుత్వ పనులల్లో నిమగ్నమవాల్సిన క్రమంలో చదువుతున్న వారు, వేరే ఉద్యోగాలు చేస్తున్న వారు అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఉపయోగపడరనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు నేరుగా క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందించేందుకు రాష్టవ్య్రాప్తంగా వలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది జగన్ సర్కార్. ఈ క్రమంలో ప్రతీ 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ ను నియమించాలని భావించి గ్రామాల్లో, పట్టణాల్లో వలంటీర్ల నియామకాలు చేపట్టింది.