ఏపీలో రెండు విడతలుగా జీతాలు... 

ఏపీలో రెండు విడతలుగా జీతాలు... 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.  ఈ లాక్ డౌన్ కాలంలో ప్రజలు ఎవరూ కూడా బయటకు రావడం లేదు.  కరోనా వైరస్ ను అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం భారీగా నిధులను ఖర్చు చేయాల్సి వస్తున్నది.  ప్రభుత్వం తన దగ్గరున్న నిధులను కరోనా వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తోంది. 

ఇదిలా ఉంటె, ప్రభుత్వం ఈరోజు జీతాలు చెల్లించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో భారీ కోతలు విధించింది. ఉద్యోగాన్ని బట్టి కోతలు విధించింది. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం దానిని భిన్నంగా నిర్ణయం తీసుకుంది.  ఉద్యోగుల జీతాల్లో కోతలు పెట్టకుండా, ఇవ్వాల్సిన పూర్తి జీతాలను రెండు విడతలుగా ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది.  మొదట సగం జీతం ఇచ్చి, ఆ తరువాత నిధులు సమాకూరిన వెంటనే మిగతా జీతం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.  దీనికి ఉద్యోగసంఘాల నుంచి కూడా సానుకూల స్పందన వచ్చినట్టుగా సమాచారం.