ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం...ఇక నాలుగు !

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం...ఇక నాలుగు !

ఏర్పడిన నాటి నుండి సంచలన నిర్ణయాలతో ముందుకు వెళుతోన్న జగన్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే రాష్ట్ర ప్రణాళిక బోర్డ్‌ రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రణాళిక బోర్డుల స్థానంలో నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులు ఏర్పాటు చేయాలని డిసైడ్‌ అయ్యింది ఏపీ సర్కార్. ఏపీ రాష్ట్ర ప్రణాలికా బోర్డు లానే ఈ బోర్డులు కూడా ఆయా ప్రాంతాల్లోని సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేయనున్నాయి. ప్రాంతాల మధ్య అసమానతలు, ఆర్థిక వనరులు, పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయం, నీటి నిర్వహణ తదితర విషయాలను ఈ బోర్డులు పర్యవేక్షిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. బోర్డ్‌ ఛైర్మన్‌ ను మూడేళ్ల కాలవ్యవధికి నియమిస్తారు. అలాగే నిపుణులతో కూడిన సభ్యులు నియమిస్తారని చెబుతున్నారు. విజయనగరం కేంద్రంగా శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ కేంద్రంగా ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు కేంద్రంగా ప్రకాశం, నెల్లూరు, కడప కేంద్రంగా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో బోర్డులు పని చేయనున్నాయి.