వేసవి సెలవులపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

వేసవి సెలవులపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ వైరస్‌ కారణంగా మనుషులే కాకుండా చాలా రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా విద్యా రంగం చాలా నష్టపోయింది. పాఠశాలలు ఎప్పుడు ఓపెన్‌ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల పాఠశాలలు ఓపెన్‌ చేసినప్పటికీ... వందల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి. అయితే.. కరోనా మహమ్మారి ప్రభావంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులకు క్లాసులు ప్రారంభించనుంది విద్యాశాఖ. ఇది ఇలా ఉంటే సిలబస్‌ పూర్తి చేయడం, పరీక్షలు నిర్వహించేందుకుగాను ఏపీలోని ఇంటర్మీడియట్‌ కాలేజీలకు వేసవి సెలవులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 31 వరకూ తరగతులు జరుగుతాయని.. రెండో శనివారాలు కూడా కాలేజీలు కొనసాగుతాయని తెలిపింది. కరోనా నేపథ్యంలో విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం అవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక దీంతో పాటు పదో తరగతి విద్యార్థులకు ఇవాళ్టి నుంచి రెండు పూటలా తరగతులు జరుగనున్నాయి. వీరి కోసం ప్రత్యేకంగా 103 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. జాతీయ, ఇతర పండుగలు మినహా ఆదివారాల్లో కూడా తరగతులు నిర్వహించనున్నారు.