ఏపీ కేబినేట్ సమావేశం ప్రీపోన్ వెనుక బలమైన కారణాలు ?

ఏపీ కేబినేట్ సమావేశం ప్రీపోన్ వెనుక బలమైన కారణాలు ?


కెబినెట్ సమావేశాన్ని వ్యూహాత్మకంగానే ప్రభుత్వం ప్రీపోన్ చేసినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజధానుల ఏర్పాటు విషయంలో సాంకేతిక ఇబ్బందులను అధిగమించేందుకే కెబినెట్ రేపటికి ప్రీ పోన్ చేసినట్టుగా చెబుతున్నారు. మూడు రాజధానుల ఏర్పాటుకు అనువుగా ప్రభుత్వం తెచ్చే సీఆర్డీఏ రద్దు బిల్లును మండలిలో అడ్డుకునేందుకు టీడీపీ యత్నంచ వచ్చని అందుకే మూడు రాజధానుల ఏర్పాటుపై సాంకేతిక ఇబ్బందులను అధిగమించేలా సర్కార్ కసరత్తు చేస్తోందని అంటున్నారు. సీఆర్జీఏ రద్దు బిల్లును కూడా ప్రభుత్వం మనీ బిల్లుగా ప్రవేశపెడుతోంది.

రైతులకు ఇవ్వాల్సిన కాంపన్సేషన్.. కౌలు వంటి అంశాలు ఉన్నందున్న సీఆర్డీఏ రద్దు బిల్లును మనీ బిల్లుగా సర్కార్ పరిగణిస్తోంది. రేపటి కెబినెట్లో సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఆమోదం తెలపవచ్చని అంటున్నారు. మనీ బిల్లును అడ్డుకునే అవకాశం మండలికి లేకపోవడంతోనే దీనిని మనీ బిల్లుగా ప్రవేశపెడుతున్న సర్కార్. అలాగే గత ప్రభుత్వం సీఆర్డీఏ బిల్లును మనీ బిల్లుగానే ప్రవేశపెట్టిందంని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేబినెట్లో ఆమోదించి సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రభుత్వం గవర్నరుకు పంపనుంది. గవర్నర్ ఆమోదంతో అసెంబ్లీలో సీఆర్డీఏ రద్దు బిల్లును సర్కార్ ప్రవేశపెట్టచ్చని భావిస్తున్నారు.