విజయవాడలో మళ్ళీ పూర్తి స్థాయి లాక్ డౌన్ ?

విజయవాడలో మళ్ళీ పూర్తి స్థాయి లాక్ డౌన్ ?

విజయవాడలో మళ్ళీ లాక్ డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు 21 క్లస్టర్లలో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నట్టు సమాచారం. కంటైన్మెంట్ జోన్లలో నేటి నుండి రాకపోకల మీద ఆంక్షలు విధీస్తున్నారు. ఇప్పటికే పటమట, కృష్ణ లంక, కోతపేట, మొగల్రాజుపురం, విధ్యధరాపురం, అజిత్ సింగ్ నగర్, భవాని పురం, చుట్టుగుంట, సత్యనారాయణ పురం, చిట్టి నగర్ లలో ఆంక్షలు విదించారు అధికారులు.

విజయవాడలో కొంతకాలంగా కరోనా వ్యాప్తి ముందు నుండీ గట్టిగానే ఉంది. అయితే తర్వాత కొంత తగ్గింది. అయితే ఇప్పుడు మళ్ళీ భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.  దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల్లోనూ లాక్ డౌన్ విధించడానికి వీలుగా బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించకుండా ఎక్కడిక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను కట్టడి చేసే యోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఉదయం పూట మాత్రమే బయటకు వచ్చి నిత్యావసరాలు కొనుక్కుని వెళ్లేందుకు అనుమతిస్తున్నారు.