SEC ప్రొసీడింగ్స్ ను తిప్పి పంపిన ఏపీ ప్రభుత్వం

SEC ప్రొసీడింగ్స్ ను తిప్పి పంపిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికలు క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి.. ఎస్‌ఈసీ దూకుడుగా ముందుకు వెళ్తుంటే.. అడ్డుకోవడానికి కోర్టును ఆశ్రయించింది ప్రభుత్వం.. ఇక ఉద్యోగులు కూడా ప్రభుత్వం వెంటే ఉన్నారు.. కనీసం వ్యాక్సినేషన్‌ పూర్తి అయిన తర్వాతే ఎన్నికలు వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే... సుప్రీం కోర్టు ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో... నిమ‌్మగడ్డ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. అయినప్పటికీ నిమ్మగడ్డ తగ్గేది లేదంటూ ఎన్నికలు నిర్వహించేందుకు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు అధికారులపై వేటుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డకు ఏపీ సర్కార్‌ ఝలక్‌ ఇచ్చింది. గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌పై ఎస్‌ఈసీ రిలీజ్‌ చేసిన ప్రొసీడింగ్స్‌ను ఏపీ సర్కార్‌ తిప్పికొట్టింది. ఐఏఎస్‌ అధికారులపై ప్రొసీడింగ్స్‌ను జారీ చేసే అధికారం ఎస్‌ఈసీకి లేదని సీఎస్‌ పేషీ స్పష్టం చేశారు. అధికారుల నుంచి వివరణ తీసుకోకుండా ప్రొసీడింగ్స్‌ను ఎవరూ జారీ చేయలేరని తెలిపింది ప్రభుత్వం.