ఆర్టీసీ విలీనానికి కమిటీ ఏర్పాటు

ఆర్టీసీ విలీనానికి కమిటీ ఏర్పాటు

ఆర్టీసీ విలీన ప్రక్రియపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చురుగ్గా చర్యలు చేపడుతోంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియపై ప్రభుత్వం కమిటీని నియమించింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సి. ఆంజనేయ రెడ్డిని కమిటీ చైర్మన్ గా ఆరుగురు సభ్యులతో కమిటీని నియమించింది జగన్ సర్కార్. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై ఆంజనేయ రెడ్డి కమిటీ విధివిధానాలను రూపొందించనుంది. ఈ కమిటీలో సభ్యులుగా రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆర్టీసీ ఎండీ ఉంటారు. విలీన ప్రక్రియలో ఎదురయ్యే ఇబ్బందులు, వాటి పరిష్కారంపై కమిటీ అధ్యయనం చేయనుంది. మూడు నెలల్లోగా విలీనం ప్రక్రియపై నివేదిక ఇవ్వాలని కమిటీకి ప్రభుత్వం సూచించింది. మంత్రి పేర్ని నానితో కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు టచ్ లో ఉండాలని సర్కార్ కోరింది. డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంపై సాధ్యాసాధ్యాలను కూడా ఆంజనేయ రెడ్డి కమిటీ పరిశీలించనుంది.