పోలవరం రివర్స్ టెండరింగ్ మొదలు...తొలి ఆదా ఎంతంటే ? 

పోలవరం రివర్స్ టెండరింగ్ మొదలు...తొలి ఆదా ఎంతంటే ? 

పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ షురూ అయింది. పోలవరం ప్రాజెక్టులోని ఎడమ కాల్వ లింక్, టన్నెల్ పనులకు రివర్స్ టెండర్లు పిలిచారు. ఫైనాన్షియల్ బిడ్లను జలవనరుల శాఖ తెరిచింది. ఇనిషియల్ బెంచ్ మార్కు విలువ 274. 55 కోట్ల రూపాయలు కాగా కొత్త బిడ్ విలువ 231.75 కోట్లుగా ఉంది. దీంతో 15.6 శాతం తక్కువకు మాక్స్ ఇన్ఫ్రా సంస్ధ బిడ్ వేసినట్టైంది. ఈ క్రమంలో 42.8 కోట్ల రూపాయల మేర ప్రభుత్వానికి ఆదా అవుతుందని చెబుతున్నారు. ఈ పనులు దక్కించుకోవడానికి ఆరు సంస్థలు పోటీ పడ్డాయి.

ఈ నెల 23న పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్, స్పిల్ వే, స్పిల్ ఛానెల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు టెండర్లు తెరుస్తారు. గత ప్రభుత్వ హయాంలో ఇదే ప్యాకేజీని రూ. 274 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగించగా దానిని రద్దు చేసిన జగన్ ప్రభుత్వం అదే పనికి రివర్స్ టెండరింగ్ ద్వారా ఓ సంస్థ 231 కోట్లకు బిడ్డింగ్ దాఖలు చేసినట్లు అయింది. ఆ సంస్థ పేరుతో పాటు మిగిలిన సంస్థలు కూడా ఎంతెంత ధరకు టెండర్లు దాఖలు చేశారనే విషయాలు శుక్రవారం రాత్రికి అధికారికంగా తెలిసే అవకాశం ఉంది.