శ్రీ శైల వివాదానికి చెక్ పెట్టిన సర్కార్ !

శ్రీ శైల వివాదానికి చెక్ పెట్టిన సర్కార్ !

శ్రీశైలం ఆలయంలో ఏర్పడిన వేలంపాట వివాదానికి వైసీపీ ప్రభుత్వం సత్వరంగా స్పందించి ముగింపు పలికింది. శ్రీశైలం ఆలయంలో దుకాణాల వేలంపాట వివాదంగా మారింది. ఆలయంలో అన్య మతస్థుల ప్రభావం ఎక్కువైందని వ్యాపారాలు నిర్వహించుకోవడానికి వారికే ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారని బీజేపీతో పాటు పలు హిందూ సంఘాలు వేలంపాటను అడ్డుకున్నాయి. షాపుల వేలం పాటలో ముస్లింలు పాల్గొన్నారని అక్కడి బీజేపీ నేతలు వేలంపాటను అడ్డుకున్నారు. ఈరోజు ఈ వివాదంలో ఎంటర్ అయ్యి ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ వివాదంపై స్పందించిన బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ మరో వర్గానికి షాపులను ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు.

ఈ మేరకు ట్విటర్‌లో ఓ వీడియోను పోస్టు చేయడంతో పాటు శ్రీశైలాన్ని అన్యమతస్తుల నుండి రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. రేపు ‘చలో శ్రీశైలం’కి పిలిపునిచ్చి, ఈ కార్యక్రమంలో హిందువులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. దీంతో జాగ్రత్త పడిన ప్రభుత్వం దుకాణాల వేలంపాట నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ ఈవో శ్రీరామచంద్ర మూర్తిపై బదిలీ వేటు వేసి, కొత్త ఈవోగా ఎస్ రామారావును నియమించింది. శ్రీరామచంద్ర మూర్తిని సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు సంబందిత అధికారులు.