ఎన్టీఆర్.. బాలకృష్ణ.. జగన్.. ఒకే వేదికపై.. నిజమేనా ?

ఎన్టీఆర్.. బాలకృష్ణ.. జగన్.. ఒకే వేదికపై.. నిజమేనా ?

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది సినిమా రంగంలోని సేవలను గుర్తిస్తూ నంది అవార్డులు ఇస్తుంటుంది.  2011 వ సంవత్సరం వరకు నంది అవార్డులను క్రమ్మ తప్పకుండా ఇచ్చారు.  ఆ తరువాత ఈ అవార్డుల కార్యక్రమాలు రెగ్యులర్ గా జరగలేదు.  2011 తరువాత 2014లో ఈ అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.  2012-13 వ సంవత్సరానికి అవార్డులను ఇచ్చింది.  

2012లో నానికి, 2013లో మిర్చి సినిమాకు గాను ప్రభాస్ కు ఉత్తమనటుడిగా అవార్డులను ఇచ్చారు. అత్తారింటికి దారేది సినిమాకు అవార్డు రాకపోడంతో అప్పట్లో పెద్ద రగడ జరిగింది.  ఆ తరువాత 2014, 2015, 2016 సంవత్సరాలకు గాను అవార్డులను అవార్డులను ప్రకటించినా.. వాటి ప్రధానోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేశారు.  2014కు గాను లెజెండ్ బాలకృష్ణ, 2015 కు గాను శ్రీమంతుడు మహేష్ బాబు, 2016 గాను నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలకు ఎన్టీఆర్ ను ఎంపిక చేశారు.  ఎంపిక జరిగిందిగాని అవార్డులు ఇవ్వలేదు.  

మరి అలా ఆగిపోయిన అవార్డుల కార్యక్రమాన్ని ఇప్పుడు వైకాపా ప్రభుత్వం తిరిగి ఇస్తే బాగుంటుందని సినీ పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి.  ప్రభుత్వం అందించే నంది అవార్డులు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయని సినీ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం తిరిగి అవార్డులను ప్రకటిస్తే.. ఎన్టీఆర్, బాలకృష్ణ, మహేష్ బాబు, జగన్ లను ఒకే వేదికపై చూడొచ్చు.