న్యాయవస్థపై తప్పుడు వ్యాఖలు చేసిన మరో 44 మందికి హైకోర్టు నోటీసులు 

న్యాయవస్థపై తప్పుడు వ్యాఖలు చేసిన మరో 44 మందికి హైకోర్టు నోటీసులు 

గతంలో కంటే ఇప్పుడు న్యాయవ్యవస్థ బలంగా పనిచేస్తుందా అంటే అవుననే అంటున్నారు న్యాయనిపుణులు.  గతంలో న్యాయమైన, న్యాయవ్యవస్థపైన సామాన్య ప్రజలకు ఒక విధమైన భావన ఉండేది.  కానీ, వ్యయవ్యవస్థ ఎప్పుడూ రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తుందని, అవసరమైనపుడు తమ విశేషాధికారాలు ఉపయోగించి నిర్ణయాలు తీసుకుంటుందనని ఇప్పుడు అర్ధం అవుతున్నది.  న్యాయవ్యవస్థపైన, హైకోర్టు జడ్జీలపైన తప్పుడు వ్యాఖ్యలు చేసిన 49 మందికి హైకోర్టు కొన్ని రోజుల క్రితం నోటీసులు జారీ చేసింది. 

ఇప్పుడు తాజాగా మరో 44 మందికి నోటీసులు జారీ చేసింది హైకోర్టు.  తప్పుడు వ్యాఖ్యలు చేసిన వాళ్లపై కేసులు పెట్టడం, దర్యాప్తు చేయడం వంటి బాధ్యతలను సిఐడికి అప్పగించింది హైకోర్టు.  హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలమేరకు సిఐడి రంగంలోకి దిగింది.  తాజాగా నోటీసులు ఇచ్చిన 44 మందిలో ప్రముఖ జర్నలిస్టులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు ఉన్నట్టుగా తెలుస్తోంది.