బాబు భద్రతపై ముగిసిన వాదనలు.. రిజర్వ్ లో తీర్పు..!!

బాబు భద్రతపై ముగిసిన వాదనలు.. రిజర్వ్ లో తీర్పు..!!

ఏపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతను రాష్ట్రప్రభుత్వం కుదించడంపై హైకోర్టులో కేసు నమోదైన సంగతి తెలిసిందే.  ఈ కేసులో నేడు వాదనలు జరిగాయి.  రాష్ట్ర ప్రభుత్వం దీనిపై హైకోర్టులో వివరణ ఇచ్చింది.  చంద్రబాబు నాయుడు ఇంట్లోగాని, ఆఫీస్ లో గాని ఉన్నప్పుడు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రొటెక్షన్ ఉంటుందని, మొబిలిటీలో ఉన్నప్పుడు మాత్రమే ఎన్ఎస్జీ ప్రొటెక్షన్ ఉంటుందని ప్రభుత్వం వాదనలు వినిపించింది.  ఎన్ఎస్జీ తరపు న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు.  ఈ వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కొద్దిరోజుల క్రితం దేశవ్యాప్తంగా ఎన్ఎస్జీ ప్రొటెక్షన్ లో ఉన్న 35 మంది నాయకుల లిస్ట్ ను కేంద్ర హోంశాఖ పరిశీలించింది.  అందులో కొంతమందికి రక్షణను తగ్గించింది.  అయితే, చంద్రబాబు ప్రొటెక్షన్ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు.  గతంలో ఉన్న రక్షణను అలాగే కొనసాగిస్తున్నారు.