పవన్ ఎప్పుడు ఎవరితో ఉంటారో తెలియదు...! ఏపీ మంత్రి కౌంటర్..!

పవన్ ఎప్పుడు ఎవరితో ఉంటారో తెలియదు...! ఏపీ మంత్రి కౌంటర్..!

బీజేపీకి తాను ఎప్పుడూ దూరంగా లేనంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత.. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎవరితో ఉంటారో తెలియదని కౌంటర్ ఇచ్చిన సుచరిత.. ఎమ్మెల్యేగా కూడా గెలవలేనివారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదని కొట్టిపారేశారు. ఇక, మహిళను చంపినవారిని రెండు దెబ్బలు వేసి వదిలేయాలని పవన్ కళ్యాణ్ చెప్పడం సిగ్గుచేటు అని మండిపడ్డ హోంశాఖ మంత్రి.. మహిళలపై పవన్ దృక్పథం ఈ వ్యాఖ్యల ద్వారా అర్ధమవుతోందని విమర్శించారు. మరోవైపు నేరాలకు వెంటనే శిక్ష అమలు చేయాలన్నారు హోంమంత్రి.. ఎక్కడ ప్రలోభాలతో మత మార్పిడులు జరగడంలేదని క్లారిటీ ఇచ్చిన ఆమె.. మహిళల రక్షణ విషయంలో ప్రత్యేక చట్టం చేయాలని సీఎం జగన్ ఆలోచిస్తున్నారని.. త్వరలో ఆర్డినెన్స్ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.