చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలపై ఐఏఎస్ ల భేటీ

చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలపై ఐఏఎస్ ల భేటీ

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పలువురు ఐఏఎస్‌ అధికారులు ఏపీ ఐఏఎస్‌ అధికారుల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పున్నమి ఘాట్‌ హరిత హోటల్‌లో సమావేశమయ్యారు. రాజకీయ నాయకుల వల్ల ఐఏఎస్‌ అధికారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వారు ప్రధానంగా చర్చిస్తున్నారు. చంద్రబాబు అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ తీర్మానం చేయనున్నారు. ఈ సమావేశంలో ఐఏఎస్‌ జవహర్‌రెడ్డి, జేఎస్వీ ప్రసాద్‌, ప్రవీణ్‌ కుమార్‌, ప్రసన్న వెంకటేష్‌, పి.ఉషాకుమారి, కరికల్‌ వలవన్‌, సునీత శామ్యూల్‌ పాల్గొన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు మాజీ ఐఏఎస్‌ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు కూడా చేశారు.