ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. మళ్లీ వారే టాప్‌..

ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. మళ్లీ వారే టాప్‌..

 

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. అమరావతిలో కొద్దిసేపటి క్రితం ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి విడుదల చేశారు. ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. బాలికలే ఈసారి కూడా పైచేయిగా నిలిచారు. ఫస్టియర్‌లో 60 శాతం, సెకెండియర్‌లో 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. తొలిసారిగా గ్రేడింగ్‌ విధానంలో ఈ ఫలితాలను వెల్లడించారు.

ఫస్టియర్‌లో..

  • బాలురు ఉత్తీర్ణత 56 శాతం
  • బాలికల ఉత్తీర్ణత 64 శాతం
  • మొదటి స్థానం - కృష్ణా జిల్లా - 72 శాతం ఉత్తీర్ణత
  • రెండో స్థానం - పశ్చిమ గోదావరి జిల్లా - 69 శాతం ఉత్తీర్ణత
  • చివరి స్థానం - కడప జిల్లా - 49 శాతం

సెకెండియర్‌లో..

  • బాలురు ఉత్తీర్ణత 68 శాతం
  • బాలికల ఉత్తీర్ణత 75 శాతం
  • మొదటి స్థానం - కృష్ణా జిల్లా - 81 శాతం ఉత్తీర్ణత
  • రెండో స్థానం - చిత్తూరు జిల్లా - 76 శాతం ఉత్తీర్ణత
  • చివరి స్థానం - కడప జిల్లా - 61 శాతం

మే 14 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు.. ఫీజు చెల్లింపునకు చివరి తేదీ ఏప్రిల్ 24

ఫలితాలను ఈ వెబ్‌సైట్లలో చూడవచ్చు.. 

https://results.apcfss.in

http://bieap.gov.in/