ఏపీ లాసెట్ 2019 ఫలితాలు విడుదల

ఏపీ లాసెట్ 2019 ఫలితాలు విడుదల

న్యాయవిద్యలో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ లాసెట్‌ 2019 ఫలితాలను విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు..  మూడేళ్ల బీఎల్ కోర్స్ కు 9,751 మంది దరఖాస్తు చేసుకోగా... 8,272 మంది అభ్యర్తులు పరీక్షకు హాజరయ్యారు. ఇక ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు 2,851 మంది దరఖాస్తు చేసుకోగా... 2,511 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక ఫలితాల్లో  92.4 శాతం మంది విద్యార్థులు  అర్హత సాధించినట్టు విజయరాజు తెలిపారు. ఈ నెల 27వ తేదీ నుంచి ర్యాంకు కార్డులను సంబంధిత వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వెల్లడించారు. ఇక మూడేళ్ల కోర్సులో కడపకు చెందిన వెంకట శివారెడ్డి మొదటి ర్యాంక్ సాధించగా... ఐదేళ్ల కోర్సులో శ్రీకాకుళానికి చెందిన సూరజ్ ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచాడు.