రేపు తేలనున్న పంచాయతీ ఎన్నికల వివాదం.. సర్వత్రా ఉత్కంట !
అధికార పార్టీ ఎన్నికలు వద్దంటోంది...ప్రతిపక్షం నామినేషన్లు వేస్తామంటోంది. ఉద్యోగులు... ఎన్నికలకు సహకరించేది లేదంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో....అందరి దృష్టి సుప్రీంకోర్టు పై ఉంది. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ...ఏపీ సర్కార్ సుప్రీంలో స్పెషల్ లీవు పిటిషన్ దాఖలు చేసింది. జగన్ ప్రభుత్వం వేసిన ఎస్ఎల్పీ, ఉద్యోగులు వేసిన పిటిషన్లు...రేపు విచారణకు రానున్నాయి. సర్కార్ దాఖలు చేసిన ఎస్ఎల్పీని...జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రిషికేశ్ రాయ్ బెంచ్‌కు...సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మార్చింది. రేపు ఉదయం 11గంటలకు ఎస్ఎల్పీపై విచారణ జరగనుంది. తమ వాదనలు పరిగణలోకి తీసుకోవాలని ఎస్ఈసీ...కేవియట్ దాఖలు చేశారు.
ప్రతిపక్ష నేతలు...నోటిఫికేషన్ ప్రకారం పంచాయతీలు, వార్డులకు నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు. రాజ్యాంగాన్ని గౌరవించి...తెలుగుదేశం పార్టీ నామినేషన్లు వేస్తుందన్నారు మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి. ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌కు అధికారులు డుమ్మాకొట్టడం దారుణమన్నారు. మరో వైపు ఓటర్ల జాబితాపై రేపు హైకోర్టులో...లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్నారు న్యాయవాదులు. దీనిపై హైకోర్ట్ ఏం చెబుతుంది? ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇస్తుంది? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. రేపట్నుంచి నామినేషన్ లు ప్రారంభం కానుండటంతో...నిమ్మగడ్డకు అధికారులు సహకరిస్తారా? విధులు నిర్వహించేందుకు వెనుకడుగు వేస్తున్న ఉద్యోగులపై ఎస్ఈసీ యాక్షన్ తీసుకుంటారా? ఏపీలో ఎక్కడ చూసినా ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. అందరి దృష్టి సుప్రీంపైనే ఉంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)