ఎన్నికలు ముగిసాక జగన్ కాశీయాత్రే..

ఎన్నికలు ముగిసాక జగన్ కాశీయాత్రే..

63 వయస్సులో చంద్రబాబు చేసిన పాదయాత్రకు.. జగన్ చేసిన పాదయాత్రకు పోలికే లేదని మంత్రి అమర్ నాథ్ రెడ్డి అన్నారు. చిత్తూరులో మంత్రి మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రజల సమస్యను తెలుసుకోవడానికి పాదయాత్ర చేస్తే , జగన్ చంద్రబాబును తిట్టడానికే పాదయాత్ర చేసాడని ఘాటుగా విమర్శించారాయన. ప్రతిపక్ష నాయకుడి పాదయాత్రను అంతా మర్చిపోయారని..పైలావ్ ఆవిష్కరణతోనే ప్రజలకు గుర్తు వచ్చిందని ఎద్దేవా చేశారు.మోడిని తిట్టాల్సి వస్తుందని పార్లమెంటుకు ఎంపీలు వెళ్ళడం మానేసారని, మోడి ఏం బయపెట్టాడో తెలియదు గాని జగన్ గజగజ వణికిపోతాడని అమరనాథ్ రెడ్డి కామెంట్ చేశారు.చిత్తూరు జిల్లాలో వైసిపి నాయకులు ప్రజల సంక్షేమాన్ని మరచి ప్రోటోకాల్ పేరిట రాద్దాంతం సృష్టించారని విమర్శించారు.ఇప్పుడైతే జగన్ పాదయాత్ర ముగిసింది. త్వరలో బస్సు యాత్ర చేయబోతున్నారట... ఎన్నికలు ముగిసాక కాశీయాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నాడని మంత్రి అమర్ నాథ్ రెడ్డి సెటైర్ వేశారు.