ఆగలేదు.. పోలవరాన్ని పూర్తి చేసేది మేమే..

ఆగలేదు.. పోలవరాన్ని పూర్తి చేసేది మేమే..

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలను చేపట్టారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. పోలవరం ప్రాజెక్టుపై ప్రశ్నించిన టీడీపీ సభ్యులు.. దానిపై చర్చకు పట్టుబట్టారు. పోలవరం పనులపై వివరణ ఇచ్చారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. పోలవరం పనులు ఆపేశాం అనడం సరికాదన్న ఆయన... పోలవరంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారనే విషయాన్ని గుర్తుకు చేశారు. ఇక, పోలవరం ప్రాజెక్టును హడావిడిగా తాము పూర్తిచేయానలుకోవడం లేదన్న మంత్రి అనిల్... 2021 నాటికి సమయం పడుతుందని అధికారులు చెప్పారని వెల్లడించారు. మరోవైపు, పోలవరం ప్రాజెక్టు విషయంలో ఐదేళ్ల పాటు టీడీపీ సర్కార్ ఏమీ చేయలేదని మండిపడ్డ అనిల్ కుమార్ యాదవ్... కచ్చితంగా పోలవరాన్ని వైసీపీ ప్రభుత్వమే పూర్తి చేస్తుందని స్పష్టం చేవారు. ఇక, కోర్టుకు వెళ్లి ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు.