ఏపీలో టీడీపీ ఎప్పుడో భూస్థాపితమైంది

ఏపీలో టీడీపీ ఎప్పుడో భూస్థాపితమైంది

నెల్లూరులోని పెన్నా బ్యారేజ్‌ నిర్మాణ పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పరిశీలించారు. బ్యారేజీ నిర్మాణ పనులపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పెన్నా బ్యారేజీ నిర్మాణ పనులను మార్చి, ఏప్రిల్‌ లోపు పూర్తి చేసి జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు.  సీఎం జగన్ ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను ఎన్ని అడ్డంకులు ఎదురైనా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో టీడీపీ ఎప్పుడో భూస్థాపితమయిందని వ్యాఖ్యానించారు. ప్రజావేదిక అక్రమ కట్టడం కాబట్టే దాన్ని కూల్చేశామని చెప్పారు. మాజీ సీఎం చంద్రబాబు ఇప్పటికైనా తన నివాసాన్ని ఖాళీ చేస్తే గౌరవంగా ఉంటుందన్నారు. ప్రతిపక్ష నాయకుడికి భద్రత కుదించామనడం అవాస్తవం అన్నారు. ఎంత మంది భద్రతా సిబ్బంది ఉండాలో అంత మందినే ఇచ్చామని మంత్రి అనిల్ స్పష్టం చేశారు. ప్రభుత్వంపై దేవినేని ఉమామహేశ్వర రావు చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని మంత్రి అనిల్ అన్నారు.