సున్నా వడ్డీ రుణాలపై మంత్రి క్లారిటీ..

సున్నా వడ్డీ రుణాలపై మంత్రి క్లారిటీ..

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్ 2019-20లో సున్నా వడ్డీ రుణాలకు తక్కువ మొత్తాన్ని కేటాయించడం విమర్శలకు దారితీసింది... ఓవైపు సున్నా వడ్డీ రుణాలు గత ప్రభుత్వ హయాంలో ఇవ్వలేదని ఆరోపిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్... బడ్జెట్‌లో సున్నా వడ్డీ రుణాలను కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించడం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తుండడంతో.. దీనిపై క్లారిటీ ఇచ్చారు ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి... 2019-20 ఆర్ధిక సంవత్సరంలో ప్రస్తుతం జులై రెండో వారంలో ఉన్నాం.. ఈ ఏడాదిలో రుణాలు తీసుకున్న రైతులు వచ్చే ఏడాది వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.. సకాలంలో రుణాలు చెల్లించిన రైతుల వడ్డీని ప్రభుత్వం బ్యాంకులకు జమ చేయాల్సింది కూడా వచ్చే ఏడాదే.. కాబట్టి వచ్చే ఏడాది బడ్జెట్‌లో సున్నా వడ్డీకి భారీగా కేటాయింపులు జరుపుతామని వివరణ ఇచ్చారు ఆర్థిక మంత్రి.