నా గెలుపుపై అనుమానమే లేదు..

నా గెలుపుపై అనుమానమే లేదు..

మరోఒక్కరోజే మిగిలిసింది.. రేపు మధ్యాహ్నానికి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. అయితే, గెలుపుపై ఎవరి ధీమా వారికి ఉంది. రేపు వెలువడనున్న ఎన్నికల ఫలితాలపై స్పందించిన మంత్రి దేవినేన ఉమామహేశ్వరరావు... ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. రేపటి ఫలితాల్లో విజయం మాదే... మైలవరంలో నా గెలుపుపై అనుమానమే లేదని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పోల్ మేనేజ్మెంట్‌లో టీడీపీ వైఫల్యం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారమని.. కానీ, అభ్యర్థులతో కనీసం సమావేశం పెట్టుకోలేని పరిస్థితిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉన్నారని ఎద్దేవా చేశారు దేవినేని ఉమా. ఇక ప్రశాంత్ కిషోర్ డప్పు వాయిద్యం కథ రేపటితో ముగుస్తుందంటూ సెటైర్లు వేశారు.