జగన్ బీకామ్ చేశాడా? ఎంబీఏనా?

జగన్ బీకామ్ చేశాడా? ఎంబీఏనా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... బీకామ్ చదివాడా...? ఎంబీఏ చేశాడా? అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు... పోలవరంలో రూ. 9 వేల కోట్ల పనులు జరిగితే సినిమాతో పోల్చడమేంటని జగన్‌పై మండిపడ్డ ఆయన... మానసిక సమస్య ఉంటే జగన్, వైద్యుడిని సంప్రదించాలి... కానీ, కార్మికులు, ఇంజినీర్ల కష్టాన్ని అవమానించేలా మాట్లాడడం సరికాదన్నారు. సీటు ఇస్తే మా పార్టీలోకి వస్తానన్న కన్నా లక్ష్మీనారాయణ... ఢిల్లీ వెళ్లి మాపై విమర్శలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. ఇక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన దేవినేని... సాయిరెడ్డి లాంటి దొంగకి పోలవరం పనులపై మేం ఒట్టేసి చెప్పాలా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం గోదావరిలో ప్రవాహం అనుకున్న స్థాయిలో లేదన్నారు దేవినేని... గోదావరి డెల్టాకు జూన్‌లో ఇప్పటికే 5 టీఎంసీల నీరు విడుదల చేశామని... గోదావరి ప్రవాహం పెరిగిన తర్వాతే పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు అందిస్తామన్నారు.