వాణి వినిపించేందుకు సమయం ఇవ్వరా?

వాణి వినిపించేందుకు సమయం ఇవ్వరా?

అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో మాట్లాడేందుకు టీడీపీ ఎంపీలకు సరైన సమయం కేటాయించకపోవడం అన్యాయమన్నారు ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు... విజయవాడలో మీడియాతో మాట్లాడిన దేవినేని... పార్లమెంట్‌లో మన వాణి వినిపించేందుకు సమయం ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేసిన దేవినేని... 5 కోట్ల మంది ప్రజలను బీజేపీ మోసం చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ సాయంత్రం విజయవాడలోని మున్సిపల్  స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు కాగడాలతో నిరసన ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. పార్లమెంట్‌లో అవిశ్వాసంపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కోర్టులో ఉన్నారంటూ సెటైర్లు వేశారు దేవినేని.