'విశాఖ జిల్లాకు ఇవాళ మరుపురాని రోజు..'

'విశాఖ జిల్లాకు ఇవాళ మరుపురాని రోజు..'

విశాఖ జిల్లాకు ఇవాళ మరుపురాని రోజు అన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు... అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన... సింహాచలం భూములపై ఎన్నో కుటుంబాలకు ఊరట కలిగించేలా కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామన్నారు. తొలి కేబినెట్‌లోనే సింహాచలం భూముల పరిష్కారానికి నిర్ణయం తీసుకున్నాం. అయితే కోర్టు కేసులు.. ఇతర అడ్డంకులతో ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయలేకపోయామని తెలిపారు. సింహాచలం భూముల సమస్య పరిష్కారానికి చట్ట సవరణ కూడా చేశామని గుర్తుచేశారు. చిన్నపాటి సాంకేతిక సమస్య ఉంటే.. దాన్ని కూడా సరి చేశామని వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయంతో 12,194 కుటుంబాలకు ఊరట కలుగుతుందన్నారు. పేదలకు వంద గజాల వరకు ఉచితంగా భూమి ఇస్తామని తెలిపిన గంటా... 1998 సంవత్సరంలో రేట్లను ఉన్న బేసిక్ వాల్యూగా నిర్ణయించామన్నారు. బీపీఎల్ ఎగువన ఉన్న కుటుంబాలకు ఒకటి నుంచి 200 గజాల వరకూ బేసిక్ వాల్యూ పై 7.5 శాతం వసూలు చేస్తామన్న ఆయన... భూములు నష్టపోతున్న సింహచలం దేవస్థానానికి 547 ఎకరాల భూమిని ఇస్తున్నామని వెల్లడించారు.