మహిళ ఓట్లు మొత్తం టీడీపీకే..!

మహిళ ఓట్లు మొత్తం టీడీపీకే..!

సార్వత్రిక ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురైనా మహిళ ఓర్పుతో ఓటు వేశారు.. మహిళ ఓట్లు మొత్తం తెలుగుదేశం పార్టీకే అన్నారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు... విశాఖలో నిర్వహించిన. దాదా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 128వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2009 ఎన్నికల్లో కూడా ఈవీఎంల గురించి చెప్పామని గుర్తుచేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఈవీఎంలు మొరాయించడంతో తెల్లవార్లు పోలింగ్ జరిగిందన్నారు. ఇక ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించిందని ఆరోపించిన గంటా.. ఈ రోజు దేశం ప్రమాదస్థాయిలో ఉంది కాబట్టే కాపాడేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈవీఎంలు ఎలా ట్యాపరింగ్‌ చేయొచ్చో త్వరలో కూలంకుషంగా వివరిస్తామని ప్రకటించారు గంటా శ్రీనివాసరావు.