130 అసెంబ్లీ, 20 పార్లమెంట్‌ స్థానాలు మావే..!

130 అసెంబ్లీ, 20 పార్లమెంట్‌ స్థానాలు మావే..!

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసినా.. నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. గెలుపుపై ఎవరి ధీమా వారి వ్యక్తం చేస్తున్నారు. ఏపీలోని 130 అసెంబ్లీ స్థానాల్లో, 20 పార్లమెంట్ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కొల్లు రవీంద్ర.. ఇవాళ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన... అనంతరం మీడియతో మాట్లాడుతూ... రాష్ర్టంలో తెలుగుదేశం ప్రభంజనం సృష్టించడం ఖాయమన్నారు. ఐదేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు పడిన కష్టానికి ప్రజలు పట్టం కట్టారనే నమ్మకాన్ని వెలిబుచ్చారు కొల్లు రవీంద్ర.