జగన్ చేసిన పనికే భారతిపై కేసులు...

జగన్ చేసిన పనికే భారతిపై కేసులు...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన నేరాలు, అవినీతికి నేడు ఆయన భార్య భారతి కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు... గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన...  భారతిపై ఈడీ కేసులకు సంబంధించిన పత్రాలు బయటకు ఎలా వచ్చాయని జగన్ ప్రశించడం విడ్డూరంగా ఉందన్నారు. మరి ఆయన పత్రికలో రహస్య పత్రాలను కూడా చూపిస్తారు... అవి బయటకు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. మీ అక్రమ సంపాదనతోనే ఐఏఎస్ శ్రీలక్ష్మి లాంటి అనేక మంద్రి అధికారులు కేసులు ఎదుర్కొంటున్నారని మండి పడ్డ ఆనందబాబు... ఏడేళ్ల నుంచి అక్రమ సంపాదన కేసులు ఎదుర్కొంటున్నావు... కానీ, ఆ కేసులు ఎందుకు ముందుకు వెళ్లడంలేదో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. 

బీజేపీతో జగన్ లాలూచిపడడంవల్లే కేసులు లేట్ అవుతున్నాయని ఆరోపించారు నక్కా ఆనందబాబు... అప్పట్లో కాంగ్రెస్‌తో కుమ్మక్కై బెయిల్ తెచ్చుకున్నావు... ఇప్పుడు కేసుల మాఫీ కోసం బీజేపీతో అంతర్గతంగా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. జగన్‌కు సంబంధించిన 10 కంపెనీల్లో ఆయన భార్యకు హక్కు ఉంది కాబట్టే ఈడీ చార్జిషీట్లు బయటకు తీసిందన్న మంత్రి... ఆడవారిపై కేసులు బనాయించటం బాధాకరమైన విషయమే... కానీ, మీవల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. జయలలిత అవినీతికి పాల్పడిందని ఆరోపణలు వస్తే ధైర్యంగా కేసులు ఎదుర్కొంది... అలానే భారతిని కూడా కేసులు ఎదుర్కోమని చెప్పాలని... ఎంటువంటి అవినీతి జరగకపోతే నిర్దోషిలా బయటకు వస్తుందన్నారు ఆనందబాబు. మరోవైపు 2014 ఎన్నికలలో జగన్ చూపిన ఆస్తుల వివరాలు ఏంటి? నేడు ఆయన దగ్గర ఉన్న ఆస్తుల విలువ ఎంతో ప్రజలకు చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.