రిటర్న్‌ గిఫ్ట్ అంటే ఇదేనా..!?

రిటర్న్‌ గిఫ్ట్ అంటే ఇదేనా..!?

ఐటీ గ్రిడ్స్‌ వ్యవహారంపై సోషల్ మీడియాతో తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఏపీ మంత్రి నారా లోకేష్... టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటే ధైర్యంగా వచ్చి దొంగ అబ్బాయి (వైఎస్ జగన్) తరపున ప్రచారం చేస్తారు అనుకున్నా... కానీ, డేటా దొంగలించి హైదరాబాద్ ఐటీ బ్రాండ్ ని టీఆర్ఎస్ దెబ్బ తీసిందని మండిపడ్డారు. ఇక హైకోర్టు సాక్షిగా దొర గారి దొంగతనం బయటపడిందని ట్వీట్ చేసిన లోకేష్.. తెల్ల కాగితాలపై వీఆర్‌వో సంతకాలతో అడ్డంగా దొరికిపోయారన్నారు. ప్రజాక్షేత్రంలో చంద్రబాబుని ఎదుర్కొనే దమ్ములేక ఐటీ కంపెనీలపై దాడి చేసి, ఉద్యోగస్తులను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్.