టీడీపీ నేత హత్యపై లోకేష్ దిగ్భ్రాంతి..

టీడీపీ నేత హత్యపై లోకేష్ దిగ్భ్రాంతి..

కర్నూలు జిల్లాలో డోన్‌ మండలం మల్లెంపల్లి దగ్గర తాపలకొత్తూరుకు చెందిన టీడీపీ నేత శేఖర్ రెడ్డి హత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ మంత్రి నారా లోకేష్. శేఖర్‌రెడ్డి హత్యపై సోషల్ మీడియాలో స్పందించిన లోకేష్.. ''కర్నూలులో తెదేపా నేత శేఖర్ రెడ్డి హత్య దిగ్భ్రాంతి కలిగించింది. ఆధునిక సమాజంలో ఇలాంటి ఆటవికచర్య అమానుషం. నిందితులను కఠినంగా శిక్షించాలని అధికారులను కోరుతున్నాను. శేఖర్ రెడ్డి కుటుంబానికి తెదేపా అన్నివిధాలుగా అండగా ఉంటుంది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.'' అని ట్వీట్ చేశారు లోకేష్. కాగా, హత్యకు గురైన శేఖర్‌రెడ్డి.. కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అనుచరుడుగా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు రాజకీయ కారణాలా?, వ్యక్తిగత కక్షలా? లేక వ్యాపార లావాదేవీలా అనేదానిపై ఆరా తీస్తున్నారు.