జగన్ కోరిక పగటికలే...

జగన్ కోరిక పగటికలే...

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ముఖ్యమంత్రి కావాలనుకోవడం పగటికలగానే మిగిలిపోతోందని జోస్యం చెప్పారు ఏపీ మంత్రి పరిటాల సునీత... జగన్ ఎప్పటికీ సీఎం కాలేడని... ప్రజల దృష్టిలో జగన్ ఇప్పటికీ ముద్దాయే అని అన్నారామె. ఈ రోజు శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని దర్శించున్న అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పరిటాల... శ్రీశైల మల్లన్న దయతో రాష్ట్రంలో వర్షాలు సంవృద్ధిగా కురవాలని, రైతులు సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్టు తెలిపారు. 

జగనే అసెంబ్లీకి రాకుండా ఎమ్మెల్యేలను అడ్డుకుంటూ ప్రజా సంక్షేమానికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు మంత్రి సునీత... రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకే పట్టం కట్టడం ఖాయమన్నారామె. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారామె... కొత్తపార్టీలు వచ్చి పొద్దుపోని మాటలు మాట్లాడుతున్నారని సెటైర్లు వేసిన పరిటాల సునీత... చంద్రబాబు నాయుడుని విమర్శించే అనుభవం, అర్హత పవన్ కల్యాణ్‌కు లేదన్నారు.