'బాబుకు దుర్గమ్మ అనుగ్రహం.. మళ్లీ ఆయనే సీఎం'

'బాబుకు దుర్గమ్మ అనుగ్రహం.. మళ్లీ ఆయనే సీఎం'

బెజవాడ కనకదుర్గమ్మను మంత్రి పరిటా సునీత దర్శించుకున్నారు. సామాన్య భక్తురాలిగా వెంకటాపురం గ్రామస్ధులతో కలిసి అమ్మవారిని మంత్రి దర్శించుకున్నారు ప్రొటోకాల్‌ ను పక్కన పెట్టి, దర్శనం టికెట్లు కొనుగోలు చేసి మరీ దుర్గమ్మను దర్శించుకున్నారు.  ఆమ్మ అనుగ్రహం, ప్రజల అభిమానంతో చంద్రబాబు తిరిగి సీఎం అవ్వటం ఖాయమని పరిటాల సునీత ధీమా వ్యక్తం చేసారు. రాబోయే ఎన్నికలలో.. గతంలో కన్నా అధిక స్థానాలలో టీడీపీ విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు.