ఇసుక కష్టాలకు చెక్.. 15 రోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి..!

ఇసుక కష్టాలకు చెక్.. 15 రోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి..!

రాష్ట్రంలో 15 రోజుల్లో ఇసుకను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇసుక లభ్యత, సరఫరాపై ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. పదేళ్లలో ఎన్నడూ లేనట్టుగా గోదావరి, కృష్ణా, పెన్నా నదులు పూర్తిస్థాయిలో ప్రవహిస్తుండటంతో ఇసుక తవ్వకాలకు ఇబ్బంది ఏర్పడిందన్నారు. అన్‌ సీజన్‌ అని తెలిసినా విపక్షాలు దీనిని రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. ఇసుక లభ్యత కోసం ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోందని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి. ప్రస్తుతం రోజుకు 45-50 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వి తీయగలుగుతున్నామన్న ఆయన.. దీన్ని త్వరలోనే లక్షక్యూబిక్ మీటర్లకు పెంచుతామన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు రాజకీయలబ్ధితోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు పెద్దిరెడ్డి.