ఇది సూచన లాంటి హెచ్చరిక...

ఇది సూచన లాంటి హెచ్చరిక...

ఫిటెనెస్ లేని స్కూల్ బస్సులపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఫిట్‌నెస్‌ లేని స్కూలు బస్సులకు ఇవాళ సాయంత్రం వరకు సమయం ఇచ్చాం.. రేపటి నుంచి ఫిట్‌నెస్ ధ్రువీకరణ పత్రం లేకుండా తిరిగితే వాహనాలు సీజ్ చేస్తామని.. ఇది సూచన లాంటి హెచ్చరిక అన్నారు రవాణాశాఖ మంత్రి పేర్ని నాని. ఇప్పటి వరకు స్కూలు యాజమాన్యాలకు ఆడింది ఆట పాడింది పాటగా సాగిందని.. ఇకపై సాగబోదని హెచ్చరించారు. మరోవైపు మా ఎమ్మెల్యేలు (వైసీపీ) నడిపే పాఠశాలలకు చెందిన బస్సులకూ ఫిట్‌నెస్‌ లేకుంటే వాటిని సీజ్ చేస్తామని స్పష్టం చేసిన మంత్రి పేర్ని నాని.. ఈ విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కఠినంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారని స్పష్టం చేశారు.