పందెంరాయుళ్లకు మంత్రి ప్రత్తిపాటి సూచన..!

పందెంరాయుళ్లకు మంత్రి ప్రత్తిపాటి సూచన..!

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి... దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిసిన తర్వాత మే 23వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఫలితాలపై ఎవరి ధీమా వాళ్లకు ఉండగా... మరోవైపు ఇదే అదునుగా  పందెంరాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఈ స్థానంలో ఈ అభ్యర్థి గెలుస్తాడు..! ఇక్కడ ఈయనదే గెలుపు అంటూ పందాలకు తెరలేపారు. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మి పందాలు కాస్తే ప్రజలు గుల్ల అయిపోతారన్నారు ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు... గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన... టీడీపీకి 120 నుంచి 150 సీట్లు వస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రెండు రోజులు చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళితే వాల్లు సంతోష పడుతున్నారని.. టీడీపీ ఓడిపోతుందంటూ ప్రజలను మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. ఇక మోడీ, అమిత్‌షా, ఈసీని అడ్డుపెట్టుకుని ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు, మహిళలు క్యూలైన్లలో గంటల తరబడి ఉండి ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు ప్రత్తిపాటి పుల్లారావు.