నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు...

నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు...

రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు... గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన... నిధులు ఇవ్వని కేంద్రంపై పోరాడాల్సిన ప్రతిపక్షాలు... సీఎం చంద్రబాబుపై అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నరేంద్ర మోడీపై దేశంలో మెదటి సారి తిరుగుబాటు చేసింది చంద్రబాబు మాత్రమేనన్న ప్రత్తిపాటి... రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్ కేసులకు బయపడి మోడీ కాళ్లు మొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. దేశంలోని అత్యున్నతమైన వ్యవస్థలను సైతం మోడీ ప్రభుత్వం నాశనం చేసిందని విమర్శించిన మంత్రి... రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని... పెన్నా, గోదావరి నదుల అనుసంధానంతో కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లా రైతులకు మేలు జరుగుతుందన్నారు.