జాగ్రత్త....వెంకన్న జోలికొస్తే...

జాగ్రత్త....వెంకన్న జోలికొస్తే...

తిరుమల వెంకన్న జోలికి వస్తే వడ్డీతో సహా వసూలు చేస్తారన్నారు ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు... తిరుమల తిరుపతి దేవస్థానం వివాదంపై పశ్చిమగోదావరి పర్యటనలో స్పందించిన మంత్రి... మేం ఇచ్చింది రూబీ... డైమండ్ కాదని మైసూర్ వాళ్లు చెప్పారని స్పష్టం చేశారు. దీనిపై మైసూర్ రాజా సంస్థానం నుండి ఒక లెటర్ కూడా ఇస్తున్నట్టు తెలిపారు. సీఎం చంద్రబాబు ఇంట్లో వజ్రాలు ఉండడానికి ఇదేమైనా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇల్లు కాదు, వైఎస్ జగన్ ఇల్లు కాదంటూ సెటైర్లు వేశారాయన. ముందువెళ్లి వాళ్ల ఇంట్లో వెతికితే నిజం బయటపడుతుందన్న ప్రత్తిపాటి... పవిత్ర తిరుమలకు రాజకీయాలు పులిమితే వారి సంగతి వెంకన్న చూసుకుంటారన్నారు. అర్చకుల రిటైర్మెంట్‌కు, మా ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించిన మంత్రి... గత ప్రభుత్వం ఇచ్చిన జీవోనే అమలు చేశారని... ప్రజలను తప్పుదోవ పట్టించొద్దన్నారు.