జగన్‌కు అధికారం పగటి కలే..!
ఎన్నికల తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్.. రాష్ట్రంవైపు కన్నెత్తి కూడా చూడలేదు.. కానీ, అధికారం కోసం కలలు కంటున్నారని మండిపడ్డారు ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్‌కు అధికారం పగటి కలలాగే మిగిలిపోతుందని.. వైసీపీ దురాలోచనలకు మే 23న ప్రజలు తగిన బుద్ది చెబుతురని జోస్యం చెప్పారు. మరోవైపు ఎన్నికల కోడ్‌తో ఈసీ ఏపీ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం చాలా దురదృష్టకరమన్నారు ప్రత్తిపాటి... రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, వాతావరణాన్ని బట్టి ఈసీ ఎన్నికల కోడ్‌ను కొంత సవరించాల్సిన అవసరం ఉందన్న ఆయన.. దేశంలో ఏపీ పట్ల ఒక ప్రత్యేక వైఖరిని ఈసీ అవలంభిస్తున్నట్లు స్పష్టంగా కనబడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలలో అవసరాలను బట్టి సమీక్షలు నిర్వహిస్తుంటే ఈసీ ఏపీలో మాత్రం ప్రతీ విషయాన్ని రాజకీయం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. బాధ్యత కలిగిన వారు సమీక్షలు నిర్వహిస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)