'వైసీపీ అప్పుడే కేబినెట్‌ కూడా ప్రకటించుకుంది..!?'

'వైసీపీ అప్పుడే కేబినెట్‌ కూడా ప్రకటించుకుంది..!?'

వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలపై సెటైర్లు వేశారు ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు... వైసీపీ నేతలు అప్పుడే అధికారంలోకి వచ్చేశామని పగటికలలు కంటున్నారని... అనధికారకంగా అప్పుడే మంత్రివర్గాన్ని కూడా ప్రకటించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఓవైపు ప్రజల కష్టాలు తీర్చడానికి చంద్రబాబు ప్రయత్నిస్తుంటే.. వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారని ఆరోపించిన ప్రత్తిపాటి... ప్రజల తాగునీటి సమస్యపై, రైతుల దాన్యం కొనుగోళ్లపై సమీక్ష చేస్తే ఎన్నికల కోడ్ అంటూ ఆటంకాలు పెడతారా? అంటూ మండిపడ్డారు. ఇప్పుడు కూడ ప్రజలపై మీకు ఎందుకు కక్షసాధింపు అని ప్రశ్నించిన మంత్రి.. ప్రజల కష్టాలు పట్టని జగన్ విదేశాలకు వెళ్లిపోయాడని విమర్శించారు. ఇక ఎప్పుడూ లేని విధంగా ఈసీ రాజ్యాంగ ఉల్లంఘన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రత్తిపాటి. వివిధ కేసుల్లో ఏ1, ఏ2లు ఉన్నవారు ఇచ్చిన ఫిర్యాదు వెంటనే స్పందిస్తుంది. కానీ, టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుకు స్పందన లేదని ఆరోపించారు. ఈసీది... మోడీ, కేసీఆర్‌కు ఒక రూల్... చంద్రబాబుకు ఒక రూల్ అన్నట్టుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు ప్రత్తిపాటి పుల్లారావు.