ఏపీ మంత్రి వెల్లంపల్లి ఇంట విషాదం

ఏపీ మంత్రి వెల్లంపల్లి ఇంట విషాదం

ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఇంట విషాదం నెలకొంది. శ్రీనివాసరావు తల్లి చందలూరి మహాలక్ష్మమ్మ ఈరోజు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె వయసు ప్రస్తుతం 73 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా  కొంత కాలంగా  అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఈ సాయంత్రం కన్నుమూశారు. రేపు బ్రాహ్మణ వీధిలోని మంత్రి స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభమై స్థానికంగా ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయని అంటున్నారు. కృష్ణా జిల్లా విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన వెల్లంపల్లి శ్రీనివాస్ కు జగన్ కేబినెట్లో చోటు దక్కింది. వైశ్య సామాజిక వర్గ కోటాలో ఆయనను మంత్రి పదవి వరించింది. ప్రజారాజ్యం, కాంగ్రెస్, బీజేపీలో పనిచేసిన ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.