'జగన్ సీమ ద్రోహిగా మిగిలిపోతారు..'

'జగన్ సీమ ద్రోహిగా మిగిలిపోతారు..'

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మండిపడ్డారు ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు... అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కడపలో పరిశ్రమలు రావడం జగన్ కు ఇష్టంలేదని... అప్పట్లో వైఎస్ ద్వారా భూములు కేటాయించడం.. జగన్ కమిషన్లు దండుకోవడం తెలిసిందేనని సెటైర్లు వేశారు. కడప ద్రోహిగా, రాయలసీమ ద్రోహిగా వైఎస్ జగన్ మిగిలిపోతారని వ్యాఖ్యానించిన యనమల... రాయలసీమలో వైసీపీ చిత్తుగా ఓడిపోనుంది అని జోస్యం చెప్పారు. 

ప్రగతికి అడ్డు ప్రతిపక్షమేనని ఆగ్రహం వ్యక్తం చేసిన యనమల... ఇటువంటి ప్రతిపక్షాన్ని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూడలేదన్నారు. ప్రగతికి అడ్డుపడేది ప్రతిపక్షమా..?  అంటూ మండిపడ్డ ఆయన.. జగన్ పాదయాత్ర ఘనంగా పూర్తి చేస్తున్నట్లు చెప్పడం హాస్యాస్పదం.. జగన్ పాదయాత్రకు స్పందనలేదని వ్యాఖ్యానించారు. పాదయాత్రలో పక్కా హామీలు లేవు. ఒక్క సమస్యపై ఏ జిల్లా కలెక్టర్ కు లేఖ రాసిన పాపాన పోలేదు.. అదొక ఉపయోగంలేని పాదయాత్రగా అభివర్ణించిన యనమల... అదొక  నిరర్ధక పాదయాత్ర.. చంద్రబాబు పాదయాత్రకు, దీనికి పోలికే లేదన్నారు. చంద్రబాబు పాదయాత్ర ప్రజలకోసం చేస్తే... జగన్ పాదయాత్ర కేసుల మాఫీ కోసమంటూ ఎద్దేవా చేశారు యనమల రామకృష్ణుడు.