ఏపీలో జెండావందనం...ఎవరెవరు ఎక్కడెక్కడ చేస్తారంటే  !

 ఏపీలో జెండావందనం...ఎవరెవరు ఎక్కడెక్కడ చేస్తారంటే  !

ప్రభుత్వం ఏర్పాటు చేశాక వచ్చిన మొదటి స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో ఆ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఏపీ రాజధాని అమరావతిలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మువ్వన్నెల జెండాను ఎగురవేస్తారు. ఇక ఆగస్టు 15న జిల్లాల్లో జెండా వందనం చేసే మంత్రుల జాబితాను ఏపీ ప్రభుత్వం నేడు ఖరారు చేసింది. ఆ వివరాల ప్రకారం కృష్ణా జిల్లా - సీఎం జగన్మోహన్ రెడ్డి, శ్రీకాకుళం - మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయనగరం - డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, విశాఖపట్నం- మంత్రి మోపిదేవి, తూర్పుగోదావరి- డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, పశ్చిమగోదావరి - డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, గుంటూరు - మంత్రి పేర్ని నాని, ప్రకాశం - మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు - మంత్రి సుచరిత, కర్నూల్ - మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్ కడప - డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, అనంతపురం - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు - డిప్యూటీ సీఎం నారాయణస్వామిలు జెండాలు ఎగురవేయనున్నారు.