బాధ్యతలు స్వీకరించిన ఏపీ మంత్రులు

బాధ్యతలు స్వీకరించిన ఏపీ మంత్రులు

ఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రులు తమకు కేటాయించిన ఛాంబర్లలో అడుగుపెడుతున్నారు. మంచి రోజు కావడంతో పలువురు మంత్రులు ఇవాళ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, శ్రీరంగనాథరాజు, పినిపె విశ్వరూప్, శంకర్ నారాయణ తదితరులు ఇప్పటికే ఛాంబర్లలో అడుగుపెట్టారు. త్వరలోనే కొత్త జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ చేపడతామని డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ చెప్పారు. స్టడీ సర్కిల్ సెంటర్ల ఫైల్ పై విశ్వరూప్‌ తొలి సంతకం చేశారు.