ఏపీ మున్సిపల్ ఎన్నికలపై ఉత్కంఠ..

 ఏపీ మున్సిపల్ ఎన్నికలపై ఉత్కంఠ..

ఏపీలో సాధారణ ఎన్నికల ప్రచారాన్ని తలపించిన మున్సిపోల్స్ ఎలక్షన్ ప్రచారం ముగియడంతో... రేపు రాష్ట్రంలోని 12 మున్సిపాలిటీలు, 75 కార్పొరేషన్లకు పోలింగ్‌ జరగనుంది. ఈ నెల 14న వెలువడే ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఇక, ఏపీ మున్సిపల్ ఎన్నికల క్యాంపెయిన్‌ సోమవారం క్లోజ్ అయింది. 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు... బుధవారం పోలింగ్ జరగనుంది. 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. 2 వేల 215 డివిజన్లు, వార్డులకు కలిపి... 7,552 మంది బరిలో ఉన్నారు. పోలింగ్‌కు... అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో 15 కార్పొరేషన్లు ఉంటే... శ్రీకాకుళం, నెల్లూరు, ఏలూరు, రాజమండ్రికి ఎన్నికలు జరగడం లేదు. చిత్తూరు, తిరుపతి, కడప కార్పొరేషన్లను వైసీపీ గెలుచుకోవటం ఖాయమైంది

పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే... మున్సిపల్ ఎన్నికల్లోనూ... ఏకగ్రీవాల్లో అధికార పార్టీ సత్తా చాటింది. చిత్తూరు కార్పొరేషనలో... 50 డివిజన్లకు 37 డివిజన్లను ఏకగ్రీవం చేసుకుంది. అటు తిరుపతి నగర పాలక సంస్థలో... 50 డివిజన్లకు ఇప్పటికే 21 డివిజన్లను కైవసం చేసుకుంది. కడప నగర పాలక సంస్థలో 50 డివిజన్లలో 23 డివిజన్లను వైసీపీ గెలుచుకుంది.  టీడీపీ తరపున చంద్రబాబు, లోకేశ్‌, బాలకృష్ణ...పలు పట్టణాల్లో రోడ్‌ షోలు నిర్వహించారు. అధికార వైపీపీ తరపున మంత్రులు, ఎంపీలు... ప్రచార బాధ్యతలు మోశారు. మరోవైపు ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికలను వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల జాబితాపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం... ఈ నిర్ణయం తీసుకుంది.