నేడు కొత్త గవర్నర్ రాక..

నేడు కొత్త గవర్నర్ రాక..

నవ్యాంధ్ర తొలి గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానలంలో రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న గవర్నర్.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. శ్రీవారి దర్శనం తర్వాత తిరిగి రేణిగుంటకు రానున్న ఆయన.. మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట నుంచి గన్నవరం బల్దేరతారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి రాజ్‌భవన్‌గా మార్చిన మాజీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. కాగా, రేపు ఉదయం 11.30 గంటలకు ఆయన ఏపీ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.