ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ తొలి స్పందన..

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ తొలి స్పందన..

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులైన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడారు బిశ్వభూషన్‌ హరిచందన్.. తనను గవర్నర్‌గా నియమించడంపై సంతోషాన్ని వ్యక్తం చేసిన ఆయన... తాను ఒడిశా వాసినైనా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఇక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ మధ్య మంచి సంబంధాలు నెలకొల్పేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ సమస్యల పరిష్కారానికి తన శక్తి మేరకు ప్రయత్నం చేస్తానని ప్రకటించారు బిశ్వభూషన్‌ హరిచందన్.