23న చలో గుంటూరు

23న చలో గుంటూరు

చలో గుంటూరు మహాసభను ఈనెల 23న నిర్వహించాలని ఏపీ ఎన్జీవో నిర్ణయించింది. మహాసభ పోస్టర్ ను విజయవాడ ఎన్జీవో హోమ్ లో ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు, ఇతర ఎన్జీవో నేతలతో కలిసి ఆవిష్కరించారు. అన్ని సంఘాలు మహాసభకు గుంటూరుకు  తరలిరావాలని అశోక్ బాబు పిలుపునిచ్చారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దు... ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్ లాంటి డిమాండ్ లతో  రెండు నెలలుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించటం లేదని పేర్కొన్నారు. విధానపరమైన నిర్ణయాలపైన ఉద్యోగులు పోరాడటం ఇదే ప్రథమని తెలిపారు. ఏపీ ప్రభుత్వం సీపీఎస్ పై కమిటీ వేస్తామన్నా ప్రయోజనం లేదన్నారు. కాలయాపన తప్ప ఏమీ లేదన్నారు. ప్రభుత్వం సీపీఎస్ కమిటీపై పునరాలోచించాలని తెలిపారు.  అవుట్ సోర్సింగ్ విధానం ఏ శాఖలో ఉండకూడదని తెలిపారు. డిసెంబర్ లో దేశవ్యాప్తంగా‌ పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది‌‌. జనవరి మొదటి వారంలో రెండు రోజుల సమ్మె చేయాలని కమిటీ నిర్ణయించినట్లు అశోక్ బాబు తెలిపారు.