ఏపీ, నైజాం `రంగ‌స్థ‌లం` షేర్‌

ఏపీ, నైజాం `రంగ‌స్థ‌లం` షేర్‌
రామ్‌చ‌ర‌ణ్ `రంగ‌స్థ‌లం` రికార్డుల మోత గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. నాన్ బాహుబ‌లి రికార్డుల్ని తిర‌గ‌రాసి టాప్ 3 సినిమాల జాబితాలో చేరిపోయింది. అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎంత వ‌సూలు చేసింది? అన్న‌దానికి లేటెస్ట్ స‌మాధాన‌మిది. ఈ సినిమా ఏపీ, తెలంగాణ‌లో సుమారు 70కోట్ల షేర్ వ‌సూలు చేసింది. ఓవ‌ర్సీస్ బాక్సాఫీస్‌లో 3మిలియ‌న్ డాల‌ర్ (20కోట్లు నెట్‌) వ‌సూళ్ల‌తో త‌డాఖా చూపించింది. ఇక ఈ సినిమా ఏపీ, తెలంగాణ‌, ఓవ‌ర్సీస్ క‌లుపుకుని ఫుల్‌ర‌న్‌లో 100 కోట్ల షేర్‌, 150కోట్ల గ్రాస్ వ‌సూలు చేస్తుంద‌ని `ఖైదీనంబ‌ర్ 150` రికార్డును అందుకుంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. రంగ‌స్థ‌లం తెలుగు రాష్ట్రాల షేర్ వివ‌రాలు ప‌రిశీలిస్తే... నైజాం -19.62కోట్లు, సీడెడ్ -13.05 కోట్లు, వైజాగ్‌-9.53కోట్లు, తూ.గో జిల్లా-5.85 కోట్లు, ప‌.గో.జిల్లా -4.60 కోట్లు, కృష్ణ‌- 5.40 కోట్లు, గుంటూరు-6.75కోట్లు, నెల్లూరు- 2.46కోట్లు, ఏపీ, నైజాం ఓవ‌రాల్‌గా 67.26కోట్లు (సుమారు 70కోట్ల‌కు చేరువ‌లో) వ‌సూలు చేసింది.