ఏపీలో పరిషత్ ఎన్నికలు ప్రారంభం... 

ఏపీలో పరిషత్ ఎన్నికలు ప్రారంభం... 

ఏపీలో పరిషత్ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి.  రాష్ట్రంలో మొత్తం 660 జెడ్పీ స్థానాలు ఉండగా అందులో 126 ఏకగ్రీవం అయ్యాయి.  వివిధ కారణాల వలన 8 చోట్ల, 11 స్థానాల్లో అభ్యర్థులు మరణించడంతో ఎన్నికలు నిలిపివేశారు.  మిగిలిన 515 జెడ్పిటీసీ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి.  515 స్థానాలకు 2058 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  ఇక రాష్ట్రంలో మొత్తం 10,047 ఎంపిటిసి స్థానాలు ఉండగా అందులో 2071 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.  వివిధ కారణాలతో 375 చోట్ల, అభ్యర్థులు మరణించడంతో 81 చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి.  మిగిలిన 7,220 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.  ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.  మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది.  ఇక ఇదిలా ఉంటె, ఎన్నికలను ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది.  పరిషత్ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రంలో మొత్తం 27,751 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.  ఇందులో 6,492 పోలింగ్ స్టేషన్లు సున్నితమైన పోలింగ్ స్టేషన్లు ఉండగా, అత్యంత సున్నితమైన పోలింగ్ స్టేషన్లు 6,314 ఉన్నాయి.  ఇక నక్సల్స్ ప్రభావిత పోలింగ్ కేంద్రాలు 247 ఉన్నాయి.  ఇక ఇదిలా ఉంటె ఎన్నికల కోసం 43,830 పేద బ్యాలెట్ బాక్సులు, 12,898 మధ్యరకం, 46,502 చిన్న తరహా బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు.  ఈ ఎన్నికల కోసం 652 రిటర్నింగ్ అధికారులు, 1091 మంది సహాయ రిటర్నింగ్ అధికారులు పనిచేస్తున్నారు.  కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది ఎన్నికల కమిషన్.